కరోనా కట్టడిలో తెలంగాణా భేష్ అన్న కేంద్రం…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ నివారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను కేంద్రం అభినందించింది. చాలా బాగా కట్టడి చేస్తున్నారని కేంద్రం కితాబు ఇచ్చింది. ఇంత త్వరగా కరోనా వైరస్ ని కట్టడి చేయడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.

హైదరాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రులు షెల్టర్ హోమ్స్‌ని IMCT సందర్శించిందని ఆమె పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రిలో అన్ని వసతులు, వైద్యసదుపాయాలు, పరికరాలు ఉన్నాయనివ్యాఖ్యానించారు. టెస్టుల నుంచి డిశ్చార్జి వరకు అన్ని ప్రొటోకాల్స్ పాటిస్తున్నారని ఆమె స్పష్టం చేసారు. పేషెంట్లకు ఉచిత వైఫై అందిస్తున్నారన్నారు ఆమె. హుమయూన్ నగర్ కంటైన్‌మెంట్ జోన్‌ను కూడా మా టీం సందర్శించిందని….

అక్కడ పోలీసులు లాక్‌డౌన్‌లు పకడ్బందీగా అమలు చేస్తున్నారని ఆమె కితాబిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందజేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. క్వారంటైన్‌ సెంటర్లోనూ అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఎండ్ టు ఎండ్ ఐటీ డ్యాష్‌ బోర్డు ద్వారా కరోనా పరీక్షల నుంచి డిశ్చార్జి వరకు పేషెంట్లను ట్రాక్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వలస కార్మికులకు ప్రస్తుతం బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news