రాష్ట్రంలో క‌రోనా విస్పోట‌నం .. నేడు 2,983 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తుంది. నేడు రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా పెరిగాయి. మంగ‌ళ వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,983 కేసులు వెలుగు చూశాయి. ఇది సోమ‌వారం కంటే భారీ సంఖ్యలో ఎక్కువ‌. సోమ‌వారం రాష్ట్రంలో 2,447 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టి తో పోలిస్తే.. నేడు రాష్ట్రంలో 536 క‌రోనా కేసులు పెరిగాయి. అయితే రాష్ట్రంలో సోమ‌వారం కేవ‌లం 80,138 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు.

corona cases | కరోనా కేసులు
corona cases | కరోనా కేసులు

కానీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,07,904 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. అలాగే నేడు రాష్ట్రంలో క‌రోనా కాటుకు ఇద్ద‌రు మృతి చెందారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి క‌రోనా మ‌ర‌ణాల‌ను పోలిస్తే.. ఈ రోజు త‌గ్గాయి. నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌తి రోజు కరోనా కాటుకు ముగ్గురు చొప్పున మ‌ర‌ణించారు. కానీ నేడు ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,706 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.