BREAKING : సీపీఐ నారాయణ అరెస్ట్ అయ్యారు. మోడీ పర్యటనను నిరసిస్తూ, సిపిఐ రాష్ట్ర కార్యాలయముందు నిరసన వ్యక్తులు చేస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ లోపల ఉన్నాం..రాత్రి నుంచి పోలీసులు ఆఫీసును అధీనంలో కి తీసుకున్నారని ఫైర్ అయ్యారు.
లోపలికి వచ్చి మా జెండాలను లాక్కున్నారని.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు అందరు కలిసి స్వాగతం పలకవలసిన అవసరం ఉంది.. కానీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని మెము నిరసన వ్యక్తం చేస్తున్నాని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.. సింగరేణి ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహించారు. ఎమ్మెల్యేలను బరితెగించి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి గవర్నర్ ఆఫీస్ నుంచి ప్లాన్ చేసి కొనుగోలు చేస్తారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కు మూడు రోజులు ముందు పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిని కి చిన్న సిప్రాసితో లెటర్ పంపిస్తారా అని ఆగ్రహించారు నారాయణ.