కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి జీతాలు కట్ చేయండి : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

-

కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిలకు జీతాలు కట్ చేయండి అని  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  119 ఎమ్మెల్యేల్లో 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి బద్దకిస్తున్నారు. అసలు అసెంబ్లీకి రావడానికి బద్దగించే వారు ఎమ్మెల్యే పదవీకి అనర్హులు. ఎమ్మెల్యేగా ఎన్నుకుంది అసెంబ్లీకి హాజరయ్యేందుకే.. అసెంబ్లీకి హాజరు కానప్పుడు అసలు ఎమ్మెల్యే ఎందుకు అని ప్రశ్నించారు.

రాని వ్యక్తి గురించి సీఎం ఎందుకు చర్చించడం ? ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలి. అసెంబ్లీ రాని వ్యక్తులు మీ జీతాలు తిరిగి ఇచ్చేయండి ? అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల వేతనాలు కట్ చేయాల్సిందే. నేను ఒక్కరోజు రాకపోయినా నా జీతం తిరిగి ఇచ్చేస్తాను. ఇది రాజాసింగ్, రేవంత్, కేసీఆర్ అందరికీ వర్తించాలని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news