కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదని… కరెప్షన్ ట్రీ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ పార్టీ రైతు కమిషన్ వేస్తానని చెబుతోందని… ఇవన్నీ బీజేపీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఉందని… మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేఖించిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని చూస్తే జాలి కలుగుతుందని… మందిని పొగేసేందుకు, డబ్బు ఖర్చు పెడుతున్నాడని, రాహుల్ గాంధీని తీసుకురావడం ఆయనకు కూడా ఇష్టం లేదని అరవింద్ అన్నాడు. మంత్రులు నిరంజన్ రెడ్డి బెవకూఫ్ మంత్రి అని విమర్శించాడు. కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు పనికొస్తారని తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటే దళిత యువకుడు నాగరాజును హత్య చేస్తే కనీసం కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదేనా సెక్యులర్ ప్రభుత్వం అంటూ విమర్శించారు. హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎంఐఎం అంటే టీఆర్ఎస్ భయపడుతుందని విమర్శి్ంచారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండి పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదు… కరెప్షన్ ట్రీ : ధర్మపురి అరవింద్
-