కరోనా గురించి భయపడాల్సిన పని లేదని… తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ శ్రీనివాస్ రావు ప్రకటించారు. అన్ని వ్యాధుల మాదిరిగా కరోనా ఒకటిగా మారిందని.. కరోనా వచ్చిన వారు 5 రోజులు క్వారంటైన్ లో ఉంటే చాలు అని తెలిపింది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
కరోనా కట్టడిలో విజయం సాధించామని.. మాస్క్ ఒక్క కరోనా నుంచే కాదు.. అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప కోవిడ్ కథ ముగిసింది అని చెప్పుకోవచ్చని చెప్పారు. డెంగ్యూ కంటే టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని.. టైఫాయిడ్ కలుషిత జలాలతో వ్యాపిస్తుందన్నారు. పానీపూరి, తోపుడు బండ్ల పై ఈగలు, దోమలు వాలే పదార్థాలకు దూరంగా ఉండండని.. సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు.. ప్రయివేట్ ఆస్పత్రులు వ్యాపార ధోరణితో అనవసర టెస్ట్ లు చేయించవద్దని తెలిపారు.