రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు అప్డేట్.. విచారణపై మాట మార్చిన డైరెక్టర్ క్రిష్

-

హైదరాబాద్లోని గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ విచారణలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఈ నిందితుల్లో ఏ9గా ఉన్న నీల్‌ విదేశాలకు పారిపోగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్‌ పెడ్లర్‌ సయ్యద్‌ అబ్బాస్‌ అలీజఫ్రీని పోలీసులు రిమాండ్‌కు తరలించగా ఏ4 నిందితుడిగా ఉన్న రఘు చరణ్‌కి నార్కోటిక్ అధికారులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో పరారీలో ఉన్న లిషిత నోటీసులు వచ్చిన రోజు నుంచి కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు నమోదు చేయాలని సోదరి కృషిత గచ్చిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేసింది. సయ్యద్ అబ్బాస్‌ అలీ విచారణలో భాగంగా మీర్జా వహీద్‌ బేగ్‌ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పగా అతడిని పోలీసులు విచారించి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో ప్రముఖ సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ పేరు వినిపిస్తోంది. ఈనెల 24వ తేదీన జరిగిన పార్టీలో క్రిష్‌ పాల్గొన్నట్లు అబ్బాస్‌ వెల్లడించగా విచారణకు రావాలంటూ పోలీసులు కోరారు. గతంలో శుక్రవారం హాజరవుతానని చెప్పిన క్రిష్‌ ప్రస్తుతం సోమవారం వస్తానని సమాచారమిచ్చనట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news