వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్‌ చలానాలపై డిస్కౌంట్!

-

తెలంగాణలో భారీగా ట్రాఫిక్ చలానాలు పెండింగ్లో ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే గతేడాది ఇలా పెండింగ్లో ఉన్న చలానాలను వసూల్ చేసేందుకు డిస్కౌండ్ ఆఫర్ను వాహనదారుల ముందు ఉంచి ప్రభుత్వం లాభాలు ఆర్జించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే పంథాను పాటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం వాహనదారులు ఈసారి భారీ డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైన విషయం తెలిసిందే. అందుకే ఇదే తరహాలో మరోమారు డిస్కౌంట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి, చలానాలు విధించడం అధికారులకు సులభమైంది. అయితే చాలామంది వాహనదారులు చలానాలను చెల్లించడం లేదు. పోలీసుల తనిఖీల్లో మాత్రమే చలానాలు పెండింగ్‌లో ఉన్నట్టు బయటపడుతోంది. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ పెండింగ్లో ఉన్న చలానాలు రాబట్టేందుకే ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది సర్కార్. అయితే నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news