తెలంగాణ ప్రజలకు శుభవార్త..ఈనెల 15లోగా క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఈనెల 15లోగా క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశించారు.

ఈ నెల 15లోగా జీవో-59 కు సంబంధించిన పట్టాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. జీవో-58కి సంబంధించి మిగిలి ఉన్న పట్టాలను త్వరగతిన అందించాలని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని… మరో 40 రోజుల్లో ప్లాంటేషన్ ప్రారంభించేందుకు సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్లకు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news