హైదరాబాద్ లో మరోసారి భారీ డ్రగ్స్ డంప్ పట్టుకున్నారు అధికారులు. జిన్నారం పారిశ్రామిక ఆవరణం లో భూమి లో దాచిపెట్టిన 6కోట్లు విలువైన నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేసారు అధికారులు. 52 కిలోల డ్రగ్స్ డంప్ ను గుంతలో దాచిన డ్రగ్స్ మాఫియా… ఇప్పుడు మరోసారి అదే రేంజ్ లో దాచారు. జిన్నారం లోని మేక ల్యాబోరేటరీ లో మూడు రోజులు క్రితమే 100 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
45 కిలోల ఎఫిడ్రిన్ తో పాటు 7.5 కిలోల మెఫీ డ్రోన్ ను సీజ్ చేసారు. నిందితుడు వెంకట రెడ్డి ఇచ్చిన సమాచారం తో ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి వాస్తవాలు. బొల్లారం, పఠాన్ చెరువు, మేడ్చల్, హయత్ నగర్ లో మూసివేసిన పరిశ్రమలు, కోళ్ల ఫారాలు లీజ్ కు తీసుకొని డ్రగ్స్ దందా చేస్తున్నారు.