పెద్ద స్కెచ్ తోనే రంగంలోకి దిగారు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ నగరంలో హైడ్రా గత కొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూసీ నది ప్రక్షాళన, హైడ్రా గురించి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో నేను వచ్చే సమయం లేక రాలేకపోయాను నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్న.. టెక్నికల్గా గెలిచింది ఈటెల రాజేందర్ కావచ్చు.. కానీ గెలిచింది మల్కాజ్ గిరి ప్రజలు అన్నారు.

రాజకీయ ప్రలోభాలు, దావతులు, కుట్రలు, విషపచారాలు ఎన్ని చేసినా నన్ను నమ్మి మీరందరూ ఓటు వేశారని  తెలిపారు. మిషన్ భగీరథ, కాలేశ్వరం లాంటివి అయిపోయాయి. ఇక డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆలోచన చేసి మూసి ప్రక్షాళనను తెరమీదకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 1,50,000 కోట్ల రూపాయలతో మూసిని ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో చెరువులు మురికి నిలయాలుగా ఉన్నాయని.. చెరువుల పక్కన ఉండడం ఒక శాపం అని..  కానీ దిక్కు లేక ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదు. ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్గిరిని పట్టించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం లేదు. చెరువులు అంటే ఏంటో అవగాహన లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news