తెలంగాణకు మోడీ సర్కారు శుభవార్త…రూ.400 కోట్ల‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ ఏర్పాటు

-

తెలంగాణకు మోదీ సర్కారు మరో కానుక ఇచ్చారు. గత ఎనిమిదిన్నరేళ్లుగా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరో పరిశోధనా సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO)..ను రూ.400 కోట్లకు పైగా అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనుంది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు జరగనున్నాయి.

ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే టార్గెట్ గా.. భారతదేశంలో మొదటిసారిగా ‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో వివిధ రకాల పరిశోధనా సౌకర్యాలను కల్పించానున్నారు. భారత పౌరవిమానయాన రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి యావత్ తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానంటూ కిషన్‌ రెడ్డి పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news