ఆస్పత్రిలో ఈటల.. కోలుకోవాలని ప్రత్యేక పూజలు

-

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తుండగా ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈటలకు వైద్యం అందుతోంది. దీంతో ఆయన్ను బీజేపీ నేతలు పరామర్శించారు. ఇదిలా ఉంటే ఈటల త్వరగా కోలుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. కమలాపూర్ మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఈటల కోలుకోవాలని కోరుకున్నారు.

మరోవైపు తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని, త్వరలో మళ్లీ పాదయాత్ర‌ చేపడతానని ఈటల రాజేందర్ తెలిపారు. ఈటల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని తెలిపారు.

కాగా హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రజా దీవెన పేరుతో ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వీణవంక మండలంలో ప్రజలను కలుస్తున్న నేపథ్యలో ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రజా దీవెన యాత్రకు బ్రేక్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news