మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణరెడ్డి 2023 డిసెంబర్ 06 వరకు కొనసాగారు. నవంబర్ 30, 2023న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేసారు. దీంతో ఆయన రాజీనామా చేయగా.. మార్చి 28న ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక ఫలితాలు ఏప్రిల్ 02న రానుండగా.. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఫలితం వాయిదా పడింది.
జూన్ 01న చివరి దశ ఎన్నికలు ముగియడంతో రేపు జూన్ 02న ఫలితం వెల్లడికానుంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటలకు బాలుర కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.