విద్యార్థులలోని ఒత్తిడిని తగ్గించేందుకే పరీక్ష పే చర్చ – బండి సంజయ్

-

మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి సనత్ నగర్ లోని ఓ స్కూల్ లో పాల్గొన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడంలో పడే ఇబ్బందులను తొలగించేందుకు పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో 600 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

గతంలో ఏ ప్రధాని అయినా, ఇతర పార్టీల నేతలు ఎవరైనా పిల్లల గురించి ఏనాడైనా కనీసం ఆలోచించారా? అని ప్రశ్నించారు. మోడీ ఆలోచించి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ముందుగానే పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ చేసుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే ర్యాంకులు వస్తున్నాయన్నారు. అలాంటి నిర్బంధ చదువులు ఎందుకు? అన్నారు.

యాజమాన్యాలు విద్యార్థులకు బయటి ప్రపంచాన్ని చూడనివ్వకుండా చేస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే పరిస్థితి ఏర్పడాలన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో పోటీ పడటం కాదు.. ముందు వారితో వారు పోటీ పడటం అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు పక్క విద్యార్థులకు ర్యాంకులు వస్తున్నాయని ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. మన చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలే తప్పితే.. ర్యాంకుల కోసం కాదు అనే నిజాన్ని తెలుసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news