‘ఫలక్‌నుమా’ ఘటనలో పలువురిని రక్షించిన రాజుకు తీవ్ర అస్వస్థత

-

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో  ఫలక్‌నుమా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టి చాలా మంది ప్రాణాలతో బయటపడటానికి కారణమైన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని లక్ష్మీనగర్‌నివాసి సిగిల్ల రాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అతడి తల్లి సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఛాతి నొప్పితోపాటు తలనొప్పి ఉందని ఆయన తల్లి పేర్కొన్నారు. తమ కుమారుడి అనారోగ్య సమస్యను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన తల్లి కోరారు.

రాజు ఇటీవల ఒడిశా పర్లాకిమిడిలోని అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఐదురోజుల కిందట పలాసలో ఫలక్‌నుమా రైలెక్కాడు. భువనగిరి సమీపంలో రైలులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పసిగట్టి చైన్‌లాగి 60 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగడానికి కారణమయ్యారు. తోటి ప్రయాణికులను రక్షిస్తున్నప్పుడు మంటలద్వారా వచ్చిన పొగను సుమారు 45 నిమిషాలు పీల్చాడు. తరువాత ఆయన స్పృహతప్పి పడిపోగా రైల్వే సిబ్బంది భువనగిరి ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news