రామగుండంలో తిరిగి ప్రారంభమైన ఎరువుల కర్మాగారం

-

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్ఎఫ్సిఎల్ లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం దేశంలో ఎరువుల వాడకం పెరగడంతో యూరియా డిమాండ్ పెరిగింది.

ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందించలేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని ఆర్ఎఫ్సిఎల్ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి సమయం కోరారు. ఇందుకు ఏసీబీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతోందని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news