హుజూరాబాద్ లో ఇవాళ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. తాను చేసిన అభివృద్ధి గురించి గుర్తు చేశారు ఈటల. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కరోనా సమయంలో తాను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, కోఠి, అబిడ్స్ తిరిగానని గుర్తు చేశారు. కరోనా మొదటి పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చానని గుర్తు చేశారు. కరోనా సమయంలో ఆంక్షలు పెట్టిన నాడు ఆసుపత్రుల చుట్టూ నేను తిరిగాను. ఇందిరా పార్కు ఉద్యమాల గడ్డ.. ఉద్యమాల గడ్డను నిషేదించిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు.
ఆర్టీసీ కార్మికులు 39 మంది ఆత్మహత్య చేసుకున్నారని.. 1500 మంది కార్మికులను డిస్మిస్ చేసినప్పుడు నేనే ప్రశ్నించాను. నా రాజ్యంలో సమ్మెకు ఆస్కారం లేదని కేసీఆర్ ఆంక్షలు పెట్టాడు. కోట్ల రూపాయలు డబ్బులు, మద్యం పంపిణీ చేసినా తాను 46 వేల మెజార్టీతో హుజూరాబాద్ ప్రజలు గెలిపించారు. మరోసారి కూడా తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు ఈటల రాజేందర్.