తెలంగాణ సచివాలయంలో అంతస్థుల వారీగా శాఖలు..వివరాలు ఇవే

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారుజామున 5:30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.


ఈ యాగం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై 1:20 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత అర్చకులు నిర్ణయించిన పుష్కర అంశలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నేరుగా ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు కూడా వారి చాంబర్లకు వెళతారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య ఆరు నిమిషాల వ్యవధిలో సీఎం సహా మంత్రులు, అధికారులు అందరూ ఏదో ఒక ఫైల్ పై సంతకం చేసేస్తారు.

తెలంగాణ సచివాలయంలో అంతస్థుల వారీగా శాఖలు..

* గ్రౌండ్ ఫ్లోర్: ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ
* మొదటి అంతస్తు: విద్య, పంచాయతీరాజ్, హోం
* రెండో: ఆర్థిక, ఆరోగ్య, ఎనర్జీ, పశుసంవర్ధక
* మూడో: మున్సిపల్, ఐటీ, కామర్స్, ప్లానింగ్, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, వ్యవసాయం
* నాలుగో: అటవీ, న్యాయ, నీటి పారుదల, పౌరసరాఫరాలు, బీసీ సంక్షేమ
* ఐదో: R&బ, సాధారణ పరిపాలన
* ఆరో: సీఎం, సిఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు

Read more RELATED
Recommended to you

Latest news