చర్లపల్లి టెర్మినల్​ పునర్​ నిర్మాణానికి రూ. 430 కోట్లు !

-

ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతంగా పూడ్చే పనిలో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్​, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్​, కొమురవెల్లికి ప్రత్యేక రైల్వే స్టేషన్​ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఉపారని కేంద్రమంత్రి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఆదివారం మంత్రి జి.కిషన్​ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్​ ను సందర్శించి జరిగిన పనులపై అధికారులతో ఆరా తీశారు. స్టేషన్​ మొత్తం కలియదిరిగి ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా ఏ మేరకు జరగాల్సి ఉంది? అనే విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


చరపల్లి టెర్మినల్​ పునర్​ నిర్మాణానికి రూ. 430 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రస్తుతం 98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చె నెలఖరు వరకు ప్రయాణికులకు ఈ స్టేషన్​ ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్​ర్టంలోని మౌలిక వసతుల అభివృద్దఙపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాతీయ రహదారులు, విశ్వవిద్యాలయాలు, అత్యంత వేగవంతంగా రైల్వేల అభివృద్ధిని చేపడుతుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news