వరంగల్‌ లో రూ.1600 కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన..15వేల మందికి ఉపాధి

-

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమలో 15 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి దొరకనుంది. మంత్రి కేటీఆర్, కిటేక్స్ సంస్థ ఎండీ సాబు జేకబ్ కలిసి ఇవ్వాళ ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో మనకంటే మెరుగైన పాలన ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.

పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. హైదరాబాద్ ధమ్ బిర్యాణీ తినిపోతారని రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా… టీపీసీసీ, టీ బీజేపీ వచ్చేదా..? అని ప్రశ్నించారు.నిన్న వరంగల్ కు పొలిటికల్ టూరిస్ట్ వచ్చిపోయారని.. రాహుల్ గాంధీకి వడ్లు తెలియదు, ఎడ్లు తెలియదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో రైతుబందు, రైతు బీమా ఉందా…? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news