తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. అన్ని నియోజకవర్గాల్లో ఫ్రీ కోచింగ్ సెంటర్లు

-

రెండు రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 90000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. దీంతో నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నారు.

ఈ తరుణంలోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు టీ శాట్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అందరూ ఎమ్మెల్యేలు అలాంటివి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆయన భరోసా కల్పించారు. భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సీఎం కేసీఆర్ పాదాభివందనం అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లను నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని.. అలాగే ఉద్యోగాలు పొందాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news