సీఎం కేసీఆర్ ఆదేశిస్తే, కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా – హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్

-

సీఎం కేసీఆర్ ఆదేశిస్తే, కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ఆదేశిస్తే తప్పకుండా ఆయన ఆదేశాలని పాటిస్తాను‌. నా ఉద్యోగానికి నేను రిజైన్ చేయబోతున్నానని, వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.

telangana-dh-srinivas
telangana-dh-srinivas

నేను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీకు తెలియజేస్తానన్నారు. కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నాను అని పేర్కొన్నారు. అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ఆదేశిస్తే తప్పకుండా ఆయన ఆదేశాలని పాటిస్తాను‌. అప్పటివరకు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news