నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే మాఫియాని కట్టడి చేసిన యోగి ఇక ప్రజలతో మమేకమయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎక్కడ పర్యటించినా అక్కడ ప్రజల సమస్యలు వినేందుకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. నేరుగా ప్రజలను కలిసి వారితో మాట్లాడటo వలన సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారికి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. ప్రజలకు నమ్మకం కలిగించినట్టు ఉంటుంది.
ఈ క్రమంలో గోరఖ్ పూర్ బుధవారం పర్యటించిన యోగి అదిత్యనాథ్ దిగ్విజయ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి ఓపికగా సమస్యలు విన్నారు. సందర్శకుల మాటలు విన్న యోగి, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏది ఏమైనా అర్జీలు పెండింగ్‌లో ఉండరాదని అధికారులకు గట్టిగా చెప్పారు.
దాదాపు 400 మంది సందర్శకులు విచ్చేసిన ఈ వేదికపై ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఆందోళన చెందవద్దని అర్జీదారులకు భరోసా కల్పించారు.
ఒక జంట కోరికపై, యోగి ఆరు నెలల బాలికకు అన్నప్రాశన చేశారు. మరో చిన్నారిని కూడా ఆశీర్వదించి చాక్లెట్లు ఇచ్చారు.పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ భూములను లాక్కుంటున్నారని మహిళా ఫిర్యాదుదారులు ముఖ్యమంత్రికి చెప్పగా భూమాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఫీడ్ బ్యాక్ తీసుకున్న యోగి…అధికారులు అక్రమాలకు పాల్పడితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
విద్యుత్ సరఫరాలో తరచుగా విఘాతం కలుగుతోందని గ్రహించిన యోగి, పునరుద్ధరణ మరియు లోడ్ అప్‌గ్రేడేషన్ కోసం షట్‌డౌన్‌ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని అన్నారు.నీటి ఎద్దడిని పరిష్కరించడానికి అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించిన యోగి, ఒక వారంలో కాలువలను శుభ్రపరచడం పూర్తి చేయాలని ఆదేశించారు మరియు వరదలు వచ్చే అవకాశం ఉందని, ఆ లోపు కాలువలను పునరుద్ధరించాలని చెప్పారు.
మొత్తానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అఆదిత్యనాథ్ ఆదర్శవంతమైన పాలన సాగిస్తూ రోజురోజుకీ ప్రజలకు చేరువ అవుతున్నారు. సమస్యల పరిష్కారంలో సీఎం కల్పిస్తున్న భరోసా పట్ల హర్షం వ్యక్తపరుస్తున్నారు.