సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి..గెలుస్తా – గద్దర్‌ సంచలనం

-

నూతన రాజకీయ పార్టీని స్థాపించిన గద్దర్… గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ.. కెసిఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించారు. బంగారు తెలంగాణ కాలేదు, పుచ్చి పోయిన తెలంగాణ చేశారని… కెసిఆర్ విధానాలు తప్పు అంటూ ఫైర్‌ అయ్యారు.

ధరణి పేరుతో కెసిఆర్ భూములు మింగాడని.. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదని విమర్శలు చేశారు. దొరల పరిపాలన జరుగుతోందని… 77 ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టానని వెల్లడించారు. భారత రాజ్యాంగం తీసుకొని ఓట్ల యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాత వాసం నుంచి ప్రజలను చైతన్యం చేశానని..ఇక నుంచి పార్లమెంటరీ పంథా ను నమ్ముకుని బయలుదేరానని వెల్లడించారు. ఇది శాంతి యుద్ధం…ఓట్ల యుద్ధం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news