Gold Price Today : మహిళలకు కాస్త ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

 

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

Gold Price Today
Gold Price Today

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 450 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 500 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 77, 000 గా నమోదు అయింది.