కెసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ నుంచి… ఆరోగ్య మహిళా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేశారు కేసిఆర్ ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఇందులో భాగంగా ప్రతి మంగళవారం వయసు తో సంబంధం లేకుండా అతివల అందరికీ ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేసి… మందులు అందించనున్నారు. మొదట 24 జిల్లాల్లోని 100 ఆసుపత్రులలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం లో భాగంగా డయాబెటిస్, రక్తపోటు పరీక్షలతో పాటు… రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ కూడా చేయనున్నారు. ఒక కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంది.