ప్రాణత్యాగం.. మనవళ్లకు కరోనా సోకవచ్చు.. తాత నానమ్మ ఆత్మహత్య

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం కుదేలైపోతుంది. చనిపోతే చూటడానికి వచ్చేవారు లేని దుస్థితి తీసుకువచ్చింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న తాత నాన్నమ్మ తమ మనవళ్లకు తమ ద్వారా కరోనా సోకుతుందేమోనని భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈమేరకు సూసైడ్‌ నోట్‌ రాసి ప్రాణ త్యాగం చేశారు. అయ్యో ఎంతపని చేశారంటూ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటుతున్నాయి.

వివరాల్లోకెళితే.. ఈ విషాదకర ఘటన హైదదాబాద్‌లో చోటుచేసుకుంది. పంజాగుట్ట రాజ్‌నగర్‌ మక్తాలో నివాసముండే వెంకటేశ్వర నాయుడు, వెంకటలక్ష్మి దంపతులు గత కొన్ని రోజులుగా దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గపోయేసరికి తమకు కరోనా సోకిందేమోనని భయపడ్డారు. కరోనా ఒకరి నుండి ఒకరికి సోకుతుందని, ఈ వ్యాధి తమ ముద్దుల మనవళ్లకు సోకే ప్రమాదముందని బావించారు. శనివారం ఆగష్టు 1వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి సేవించారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఈ ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి పక్కన సూసైడ్‌ నోట్‌ ఉండటంతో ఆత్మహత్యకు గల కారణం తెలిసింది.

మాకు కరోనా లక్షణాలున్నాయి. మా నుండి ఈ వ్యాధి మా మనవళ్లకు సోకే ప్రమాదం ఉంది. అందుకే ఆత్మ హత్య చేసుకుంటున్నాం అంటూ సూసైడ్‌ నోట్‌లో వారు ఇలా రాసిపెట్టారు.