తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి సారిగా గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రిలిమ్స్ పరీక్షలు రెండు దఫాలుగా జరిగాయి.. రెండు సార్లు కూడా వాయిదా పడ్డాయి. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాత నోటిఫికేషన్ కి కొన్ని పోస్టులను కలిపి కొత్తగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ విడుదలైన తరువాత ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి.
అందులో 31వేలకు పైగా మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యారు. వారికి ఈనెల 21 నుంచి ఇవాళ్టి వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో నెం.29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరూ అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.