దీపావళి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సంస్థలు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్ పేరుతో గంటసేపు ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ముహూరత్ ట్రేడింగ్ ప్రతీ సంవత్సరం దీపావళి రోజున గంటసేపు ఉంటుంది. ఈసారి నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ముహూరత్ ట్రేడింగ్ సమయాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ నిర్ణయించింది.
ముహూరత్ సమయంలో చాలామంది స్టాక్స్ కొనడానికి ఆసక్తి కనబరుస్తారు. కొంతమంది కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ముహూరత్ సమయాన్ని సరైనదిగా భావించి డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు.
అయితే ఈసారి ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఏయే స్టాక్స్ కొనాలో నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ఆ లిస్టు ఒకసారి చూద్దాం.
బజాజ్ ఫైనాన్స్ ( టార్గెట్ ప్రైస్ 8552)
ఈ మధ్యనే పబ్లిక్ ఆఫర్ కి వచ్చిన బజాజ్ ఫైనాన్స్.. ఇన్వెస్టర్లకు ముహూరత్ ట్రేడింగ్ రోజున లాభదాయకంగా ఉండనుందని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (టార్గెట్ ప్రైస్ 3500)
గత కొన్ని రోజులుగా ఈ సంస్థ మార్కెట్లో అండర్ పర్ఫార్మ్ చేస్తోంది. కాబట్టి ముహూరత్ ట్రేడింగ్ రోజున ఈ స్టాక్ ని తీసుకుంటే మంచి గ్రోత్ కనబరిచే అవకాశం ఉందని అంటున్నారు.
గ్రావిటా ఇండియా (టార్గెట్ ప్రైస్ 3068)
రీసైక్లింగ్ ఇండస్ట్రీలో లీడింగ్ ప్లేయర్ గా ఉన్న గ్రావిటా సంస్థ స్టాక్ ప్రైస్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేయిస్తున్నారు.
షేర్ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడులకు లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు స్టాక్ వివరాలు దానికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. కాబట్టి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేముందు వాటి తాలూకు డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా చదవండి.