రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ప్రజల ఆశలు, ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని  కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ లో రూ.26లక్షల వ్యయంతో దోబిఘాట్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల పాలన చూశాక అన్ని వర్గాల ప్రజలు మోసపోయామని భావిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు.

పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామని చెప్పి ఇంత వరకు పెంచలేదు. యువతకు నిరుద్యోగ భృతి గురించి ఇంకా సీఎం ఆలోచించడం లేదు. రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. రైతు బంధు ఉందో.. లేదో తెలియదని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సమాజంలో చేతి వృత్తులు కనుమరుగు అవుతున్న నేపథ్యంలో వారికి ప్రధాని మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news