తెలంగాణకు రూ.548 కోట్ల GST పరిహారం విడుదల

-

GST పరిహారం కింద చివరి విడతగా కేంద్ర సర్కార్ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.16,982 కోట్లు విడుదల చేయగా.. అందులో తెలంగాణకు రూ.548 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు దక్కాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు అయిదేళ్లపాటు పరిహారం చెల్లిస్తామన్న మాటకు కట్టుబడి ఈ మొత్తం చెల్లించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ 49వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. దీంతో మొత్తం పరిహారం చెల్లింపు పూర్తయినట్లేనని తెలిపారు.

జీఎస్టీ బకాయిలకు ఆడిట్‌ ధ్రువీకరణపత్రాలు సమర్పించిన ఆరు రాష్ట్రాలకు రూ.16,524 కోట్లు చెల్లిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో దిల్లీ, కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయని, మిగిలిన రాష్ట్రాలు ఆడిట్‌ పత్రాలు సమర్పించలేదని చెప్పారు. తెలంగాణకు ఈ విభాగంలో రూ.1,265.12 కోట్ల పరిహారం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news