కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి తెలంగాణా సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే జగా ఉండి, కొత్త ఇల్లు కట్టుకుంటే… రూ.3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. హాయత్ నగర్ లో LIC ఏజెంట్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… బిఅర్ఎస్ కు భయపడి బిజెపి మునుగోడు ఎన్నికల కుట్ర అని…జాతీయ పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ దృష్టి మరల్చేందుకు బిజెపి ప్రయత్నం అన్నారు.
వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి తెచ్చిన ఉప ఎన్నిక ఇది, ప్రజల కోసం కాదు, రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక ఇది.మునుగోడులో టిఆర్ఎస్ గెలుస్తుంది, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. LIC విషయంలో సంపూర్ణ అవగాహన ఉంది. మీరు అద్భుతంగా పని చేస్తారు.మీరు ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సు కోసం మీరు పని చేస్తారు. మునుగోడు ఎన్నిక ఎందుకోసం ఎవరి కోసం వచ్చిందని అన్నారు. ప్రజలకు సేవ చేయకుండా సొంత లాభం కోసం రాజీనామా చేసుడు ఎందుకు. ఎవరిని తృప్తి పరిచేందుకు..ఎందుకు బలవంతపు ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నిoచ్చారు.