#HappeningHyderabad : భాగ్యనగర అభివృద్ధిపై వీడియో పెట్టు.. ప్రైజ్ కొట్టు

-

మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉందా.. మీకు రీల్స్ తీసే అలవాటుందా.. అయితే మీరు ఈజీగా #HappeningHyderabad రీల్స్ కాంటెస్టులో పాల్గొనచ్చు. ఏకంగా రూ.50వేలు క్యాష్ ప్రైజ్ పొందొచ్చు. ఈ తొమ్మిదేళ్లలో హైదరాబాద్ మహానగరం ఎంతో అభివృద్ధి చెందింది. నగరంలోని ఎల్బీనగర్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. పదేళ్ల కింద హైదరాబాద్‌ వచ్చిన వారు.. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే కొన్ని ప్రాంతాలను చూసి గుర్తు పట్టలేరు కూడా. అందుకే ఈ తొమ్మిదేళ్లలో భాగ్యనగరం ఎంత అభివృద్ధి చెందింది.. ఎంత మందికి ఈ నగరంపై అవగాహన ఉందో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

హైదరాబాద్‌ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రీల్స్‌ కాంటెస్ట్‌’ నిర్వహిస్తోంది. భారీగా ప్రైజ్‌ మనీ కూడా ప్రకటించింది. విజేతకు   రూ.50,000, ఫస్ట్‌ రన్నరప్‌ రూ.25,000, సెకండ్‌ రన్నరప్‌ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్‌ ప్రైజ్‌ రూ.5వేలు చొప్పున. ఇవ్వనున్నట్టు తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రకటించింది.

ఇందుకోసం  మీరు ఎంతో ఇష్టపడే హైదరాబాద్‌లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృధ్ధికి అద్దంపట్టే దృశ్యాలను 60 సెకన్ల నిడివి మించకుండా వీడియో తీయాలి. ఆ వీడియోను @DigitalmediaTS ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలి. ఆ తర్వాత వీడియో లింక్‌ను [email protected]కు మెయిల్‌ చేయాలి. ఏప్రిల్‌ 30వ తేదీతో ఈ పోటీ ముగుస్తుంది. మే రెండో వారంలో విజేతలను ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news