హైదారాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఐదు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

-

హైదరాబాద్ లో ప్రత్యేక పర్యాటక కేంద్రం అయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఐదు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని వారు తెలియ చేశారు. కేబుల్ బ్రిడ్జి మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యం లో, వాహనదారులు, పర్యాటకులు దీనిని దృష్టిలో పెట్టుకోవాలని ఆదేశించారు. వాహనదారులు ప్రత్యమ్నాయమార్గాలు చూసుకోవాలని సూచించారు అధికారులు.

Durgam Cheruvu cable bridge in Hyderabad to remain as tourist spot

ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ఐకానిక్ స్పాట్‌గా ఉంది దుర్గం చెరువు తీగల వంతెన. దీనిని 2020 సెప్టెంబర్‌లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో చాల ఎక్కువగా ఫోటోలు తీసుకుంటున్నన ప్రదేశాలలో ఇది ఒకటి అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news