ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది అని చెప్పాలి. పంత్ స్థానంలో ప్రస్తుతం డేవిడ్ వార్నర్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. గత మ్యాచ్ లో బ్యాట్స్మన్ వైఫల్యంతో లక్నో చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. అందుకే ఈ రోజు గుజరాత్ టైటాన్స్ పై గెలుపు సాదించడానికి పలు రకాల వ్యూహాలతో సిద్ధమైంది అని చెప్పాలి. అందులో భాగంగా వెస్ట్ ఇండీస్ టీ 20 కెప్టెన్ మరియు భారీ షాట్ లను అలవోకగా కొట్టగల సామర్ధ్యం ఉన్న పావెల్ ను తుదిజట్టులోకి తీసుకోలేదు. ఇతనిపై ఈ మ్యాచ్ లో వేటు వేస్తూ కోచింగ్ స్టాఫ్ నిర్ణయం తీసుకుంది. ఇతని ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జ్ జట్టులోకి వచ్చాడు.
ఈ టీం లో ఓవర్ సీస్ ప్లేయర్స్ రూపంలో వార్నర్, మార్ష్ మరియు రసౌ లు జట్టులో ఉన్నారు. ఇప్పుడు పావెల్ బదులుగా అన్రిచ్ నోర్ట్జ్ ను జట్టులోకి తీసుకుంది. అయితే ఢిల్లీ తీసుకున్న ఈ టఫ్ కాల్ ఎంత వరకు జట్టుకు మంచి చేస్తుంది అన్నది చూడాలి.