హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త

-

హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. నిమ్స్ లో పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌ను మరియు 200 ఐసియు పడకలను ప్రారంబించి, పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు…. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
నిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, మరియు SUVEN లైఫ్ సైన్సెస్ కలిసి NIMSలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు.

మన ప్రభుత్వం 2 లక్షలు నుంచి 5 లక్షలు వరకు ఆరోగ్య శ్రీ ని పెంచడం జరిగిందని.. నిమ్స్ ఆసుపత్రులు హార్ట్ అండ్ కిడ్నీ ,లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ లు ఎక్కువగా జరుగుతున్నాయి.. లంగ్ సర్జరీ లు కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిమ్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. ప్రతి సంవత్సరం 200 కోట్లు గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐసియు 166 బెడ్స్ ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యని, మరో 200 అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 74 అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 440 ఐసియు లో ఉంటాయి.. గతంలో 68 ఉంటే ఇప్పుడు మరో 125 వెంటిలేటర్స్ ని మంజూరు చేసుకున్నాం. ఇందులో 25 అడ్వాన్స్ లైఫ్ వెంటిలేటర్ లు ఉన్నాయి. 5 ఎక్మో మెషిన్ లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

ప్రస్తుతం నిమ్స్ లో 1480 పడకలు ఉన్నాయి. త్వరలో 2000 పడకలు బిల్డింగ్ ని నిర్మించనున్నాం, పక్కనే ఉన్న ఎర్రమంజిల్ కాలనీ వద్ద గల ఉన్న 32 ఎకరాల్లో నిర్మిస్తాం. త్వరలో పాలనాపరమైన అనుమతులు ఇవ్వనున్నామన్నారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు తీర్చేలా…హైదరాబాద్‌ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హస్పిటళ్ల ఏర్పాటు జరుగుతున్నది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేస్తున్నదని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news