రాహుల్ సభకు 30వేల కుర్చీలేస్తే 3వేల మంది జనం రాలేదు : హరీశ్ రావు

-

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది..3 వేల మంది రాలేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్, పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు… అనంతరం మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసిఆర్ కు చాలా ఇష్టం, సెంటిమెంట్ ఉన్న ప్రాంతమన్నారు.

harish rao in husnabad

వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలి, విద్వంసం కావాలంటే కాంగ్రెస్ బిజెపికి గెలవాలన్నారు. అయోధ్య రామాలయం బిజెపి కట్టిందా, ట్రస్ట్ కట్టింది, ఆలయ నిర్మాణానికి నేను కూడా 2 లక్షలు ఇచ్చానన్నారను. నిన్న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది, 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడుగుతే ఐదు నెలల 12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పండని కోరారు.

ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్ కు వచ్చిందా ? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అంటూ విరుచుకు పడ్డారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అది గెలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news