తుది శ్వాస వరకు సీఎం కేసీఆర్ తోనే ఉంటానని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నిన్న సిద్దిపేట బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కలను నిజం చేసిన సిద్దిపేట పురిటిగడ్డ మన సీఎం కేసీఆర్ అని.. ఇది ఎన్నికల ప్రచార సభలగా లేదన్నారు. మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభలా అనిపిస్తుంది…సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు.
కేసీఆర్ ని కారణజన్ముడు అంటారు…ఆనాటి సీఎం NT రామారావుకి సిద్దిపేట జిల్లా కావాలని సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారు…సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని వివరించారు. సిద్దిపేట కి కాళేశ్వరం నీళ్లు వస్తాయి అంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయని..మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు. పదేళ్ల కింద కూలి దొరక్కపోయేది..కానీ ఇప్పుడు కూలి చేయడానికి మనుషులే దొరకట్లేదు…ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సిద్దిపేటలో కరువు కాటకాలు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ గురించి కొంతమందికి తెలియదు..కానీ సిద్దిపేట ప్రజలకి ఆయన గురించి తెలుసు అని చెప్పారు.