బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లే -మంత్రి హరీష్ రావు

-

బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లేనని మంత్రి హరీష్ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇల్లందులో BRS సభ సన్నాహక సమావే శం జరిగింది. ఈ BRS సభ సన్నాహక సమావేశం లో మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి తుమ్మల నాగే శ్వర్ రావు, ఎం ఎల్ ఏ హరి ప్రియ నాయక్, ఎం ఎల్ సి తాత మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిజెపికి ఛాన్స్ లేదని వెల్లడించారు. బిజెపిలో ఎవరైనా చేరితే అది ఆత్మహత్య సదృశ్యం మాత్రమేనని.. బిజెపిలోకి ఎవరైనా వెళ్తారంటే వారు రాజకీయాలకు దూరమై తారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో బిజెపికి ఎటువంటి అవకాశాలు ఇక్కడి ప్రజలు ఇవ్వరన్నారు. తెలంగాణ అభివృద్ది కావాలంటే, BRS తోనే సాధ్యమని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news