బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేయడం.. కుర్చీలు విరగ్గొట్టడం, టమోటాలు, గుడ్లతో దాడి, కిటీకీల అద్దాలు ధ్వంసం అయిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు వెంటనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ లోని కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు హరీశ్ రావు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్ప కూలిపోయిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి జరుగుతుంటే.. అసలు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్ కు పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వల్ల హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా..? అని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ, ఆయన గూండాలపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.