​1000కి పైగా ఎంబీబీఎస్ బీ -కేట‌గిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మైనారిటీ మరియు నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ బి కేటగిరి సీట్లలో కేటాయించే 35% సీట్లలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఇవాళ జీవో నెంబర్ 129 మరియు 130 లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలలోని 1068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 మైనారిటీ, నాలుగు నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి.