తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు అని ప్రధాని ఎలా అంటారు? – జీవన్ రెడ్డి

-

విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఐటిఐఆర్ ప్రాజెక్ట్ కనుమరుగైందన్నారు.గిరిజన సమాజం తెలంగాణ వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోతుందన్నారు. కేంద్రం గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు కల్పిస్తుంటే రాష్ట్రం మాత్రం 6% రిజర్వేషన్లు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నరాష్టానికి రావాల్సిన హక్కులను సాధించుకోలేకపోతున్నామన్నారు.

ప్రధాని మోడీ తెలంగాణ విషయంలో రాజ్యాంగ బద్దంగా మాట్లాడటం లేదన్నారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు అని ప్రధాని ఎలా అంటారు? అని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి ఉందా? అంటూ ప్రశ్నించారు. విభజన అంశాల అమలు కోసం మీతోనే మేము ఉంటామని.. విభజన అంశాలపై అఖిల పక్షం ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరకు వెళ్దాం అని సూచించారు. బీజేపీ గురించి మాట్లాడకుండా టిఆర్ఎస్ చేతులెత్తేస్తోందని ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రంతో పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news