పెండింగ్ చ‌లాన్ల చెల్లింపున‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంతంటే..?

-

పెండింగ్ ట్రాఫిక్ చ‌లాన్ల రాయితీ ప్ర‌క‌టించ‌డంతో చెల్లింపున‌కు తొలి రోజు భారీ స్పందన వచ్చింది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా సెల‌వు దినం ఉన్నా.. ఒక నిమిషానికి దాదాపు 700 కు పైగా చ‌ల‌న్ల‌ను వాహ‌నాదారులు చెల్లించారు. దీంతో ఏకంగా స‌ర్వ‌ర్లే.. త‌ట్టుకోలేక మొరాయించాయి. కాగ తొలి రోజు సెలువు దినం అయినా.. ఏకంగా 5 ల‌క్షల మంది త‌మ పెండింగ్ చల‌న్ల‌ను చెల్లించారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి తొలి రోజు రూ. 5.50 కోట్ల భారీ ఆదాయం వ‌చ్చింది.

ముఖ్యంగా హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ కొండ క‌మిషన‌రేట్ల ప‌రిధిలో రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చ‌లాన్ల‌ను చెల్లించ‌డానికి విశేష స్పంద‌న వ‌చ్చింది. మొద‌టి రోజు ఈ క‌మిషన‌రేట్ల ప‌రిధిలో దాదాపు 80 శాతం మంది పెండింగ్ ట్రాఫిర్ చలాన్ల‌ను చెల్లించార‌ని తెలుస్తోంది. అయితే నేడు వ‌ర్కింగ్ డే కావ‌డంతో ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్ర‌స్తుతం వెబ్ సైట్ మొరాయించ‌డంతో చెల్లింపులు సంక్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు.

దీంతో.. వాహ‌నాదారులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని అధికారులు తెలిపారు. ఈ నెల 31 వ‌ర‌కు పెండింగ్ చలాన్ల‌ను రాయితీతో చెల్లించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news