హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. గోల్నాక, యూసఫ్ గూడ, లక్డీకపూల్, వనస్థలిపురం, మల్లాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, విద్యానగర్, ఎల్బీనగర్, కాచిగూడ, అమీర్పేట, బోరబండ, గచ్చిబౌలి, అంబర్పేట, రాయదుర్గం, హబ్సిగూడ, తార్నాక, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఒకసారి ఏరియాల వారిగా వర్షపాతం చూస్తే..
హైదరాబాద్ లో పలు చోట్ల భారీవర్షం
షేక్పేట లో 10.6 సెం.మీ
ఖాజగూడ లో 9.6 సెం.మీ
రామంతపూర్ లో 8.1 సెం.మీ
మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 8.1 సెం.మీ
శ్రీనగర్ కాలనీ 8 సెం.మీ
మాదాపూర్ 7.3 సెం.మీ
తార్నాక లో 7.1 సెం.మీ
జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ
మైత్రివనం 6.9సెం.మీ
బంజారాహిల్స్ 6.9 సెం.మీ