అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణం చేయను : రాజాసింగ్

-

అసెంబ్లీని బహిష్కరిస్తున్న మా బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయాలని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కాసిం రజ్వీ వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని పేర్కొన్నారు. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటీన్ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఎవరిదోస్తు ఎవరు దుష్మనని అర్థమవుతుందా అని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం కి ఇచ్చిన లెక్కనే కాంగ్రెస్ కూడా భయపడి తమ చేయని కూడా ఇస్తుందని రాజాసింగ్ తెలిపారు. ఎందరో సీనియర్లు ఉన్న ఆయనే ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ ఉన్న టిఆర్ఎస్ ఉన్న టిడిపి ఉన్న రేపు బిజెపి ప్రభుత్వం ఏర్పడిన వాళ్లు కాళ్లు మొక్కి నెత్తిమీద కూర్చోవడానికి ప్రయత్నిస్తారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి అని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎం రాజ్యం నడుస్తుందని విమర్శించారు రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Latest news