తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయింది. నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది తెలంగాణ అమరుల స్మారకం. ఇవాళ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా మ. 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు తెలిపారు.
ఇవాళ ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీపార్క్ మూసివేయనున్నారు. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా శ్రీకాంతా చారి తల్లి కాసోజు శంకరమ్మను ప్రకటించే అవకాశం ఉందంటూ వాట్సాప్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదని అధికార వర్గాల సమాచారం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ అమరవీరుల స్మారకం ప్రారంభం చేయనుండగా శంకరమ్మను హైదరాబాద్‌కు రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది.