తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

మార్చి 31 లోపు కనీస ప్రతి పట్టణంలో ఒక వెజిటేబుల్, మాంసం మార్కెట్ ను నిర్మించాలని మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. పనులు వెంటనే ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 144 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 10 మార్కెట్లను ఇప్పటికే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news