హైదరాబాద్ లో స్విగ్గీ ఉండదా…?

-

హైదరాబాద్ లో స్విగ్గీ మనుగడపై ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. మాదాపూర్ కాకతీయ హిల్స్ గ్రౌండ్ లో స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆందోళన చేస్తున్నారు. గత రెండు వారాల నుంచి హైదరాబాద్ లో స్విగ్గీ బాయ్స్ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మోకాళ్లపై నిల్చుని నిరసన తెలుపుతున్నారు స్విగ్గీ బాయ్స్. యాజమాన్యాలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తున్నారు.

గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో తమ సమస్యలను పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. బేస్ పే.. అలెవెన్సు.. ఇన్సెంటివ్ లను పాత పద్ధతిలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. విధులకు స్విగ్గీ బాయ్స్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో స్విగీ డెలివరి ఆపేస్తారు అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు నిరసనలతో వాటికి బలం చేకూరింది.

Read more RELATED
Recommended to you

Latest news