జాతీయ రాజకీయాల్లో బిజీ అయి… హామీలను కేసీఆర్ మర్చిపోయారు: జగ్గారెడ్డి

-

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని… ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేసి అన్నింటిని మర్చిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నవే కొనసాగుతున్నాయి తప్పితే కొత్తవి ఏం రాలేదని అన్నారు. కేసీఆర్ ఎనిమిదేళ్లుగా హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ అయి ఇచ్చిన హామీలను మరిచిపోయారని విమర్శించారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏమయ్యాయి.. 33 జిల్లాల్లో ఆసుపత్రులను ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తాయి… ఇచ్చిన మాట అమలు ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు. రాష్ట్రంలో 590 మండలాల్లో 590 ఆస్పత్రులకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గానికి 100 పడకల ఆస్పత్రులకు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని.. సీఎం అయ్యాక కేసీఆర్ మానిఫెస్టోను మరిచిపోయారని.. కాంగ్రెస్ తరుపున మేమే గుర్తు చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్యచరణ చేపడుతాం అని అన్నారు. ఆరోగ్య శ్రీకి అసలు ఏమైందని.. పేదలకు ఆరోగ్య శ్రీ భరోసా ఇచ్చింది కానీ మీరెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news